ఆపదలో ఉన్నా ఆదుకోండి..!

నవతెలంగాణ – మంగపేట
మూడు సంవత్సరాల క్రితం పక్షవాతం రావడంతో వైద్యం కోసం ఉన్న పంట పొలాన్ని అమ్మి అప్పులు చేసి 7 లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం లేకపోవడంతో నాటి నుండి మంచానికే పరిమితమై చావుబ్రతుల మద్య కొట్టుమిట్టాడుతున్న ఓ నిరుపేద ధీనగాద ఇది. వివరాల్లోకి వెలితే మండలంలోని కమలాపురం అల్లూరుసీతారామరాజు కాలనీకి చెందిన కోరుకొప్పుల సత్యం గ్రామంలోని ఓ కేబుల్ ఆపరేటర్ వద్ద నెల వారీ బిల్లులు వసూలు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2021 మే 22న గ్రామంలో బిల్లులు వసూల్ల చేస్తూ అకస్మాత్తుగా కిందపడిపోవడంతో తోటి స్నేహితులు సత్యం బార్య రాణి కుటుంబ సభ్యులు స్థానికంగా ఆస్పత్రికి తీసుకెల్లి వైద్యం చేయించారు. వైద్యులు సత్యంకు పక్షవాతం వచ్చే సూచనలున్నాయని మెరుగైన వైద్యం కోసం వరంగల్ తీసుకెల్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం కోసం తమ వద్ద ఉన్న కొంత డబ్బుతో పాటు వారికున్న ఎకరం పంట పొలాన్ని, ఉన్న ఇళ్లును అమ్మి సుమారు రూ.7 లక్షల వరకు ఖర్చు చేసినా జబ్బు నయం కాకపోవడంతో పాటు సత్యం రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితమయ్యాడని బార్య రాణి రోదిస్తూ తెలిపింది. ఉంటానికి ఇళ్లు లేక భర్తను వదిలి కూలీ పనికి పోలేక నరకయాతన అనుభవిస్తున్న సత్యం రాణిల ధీనగాద చెప్పేదికాదు. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు, దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని సత్యంకు మెరుగైన కార్పోరేట్ వైద్యం అందిస్తే జబ్బు నయమవుతుందని వైద్యులు చెబుతున్నారని రాణి ఆవేదన వ్యక్తం చేశారు. పూట గడవడం కోసం కమలాపురంలోని ఆర్ఎంసీ పాఠశాలలో స్వీపర్ గా పని చేస్తూ ఇద్దరు ఆడ పిల్లలు రేణు, అక్షితలను ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటున్నానని దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని వేడుకుంది. కోరుకొప్పుల సత్యం, ఎకౌంట్ నెంబర్ 32259241660 ఎబీఐ కమలాపురం, ఆదుకోవాలని వేడుకుంది.

Spread the love