నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితా సవరణ కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ రాజ్యాంగబద్ధమైనదేనని, దీనిపై వచ్చిన సవాళ్లను తిరస్కరిస్తూ అత్యున్నత న్యాయస్థానం వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీతో కలిసి ఈ తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324తో పాటు ప్రజాప్రతినిధుల చట్టం-1950 కింద ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ చేపట్టే పూర్తి అధికారం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నికల కమిషన్ తన రాజ్యాంగబద్ధ బాధ్యతను నిర్వర్తిస్తోందని, ఇది స్వేచ్ఛాయుత ఎన్నికల లక్ష్యాన్ని మరింత బలపరుస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఓటర్ జాబితా సవరణపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



