- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను రాష్ట్ర ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ బృందం కలిసింది. ఉద్యోగుల పే స్కేల్ అంశంపై హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రికి వారు వినతి పత్రం అందజేశారు. ఉద్యోగుల పే స్కేల్ అమలుకు సానుకూలంగా మంత్రి స్పందించారని, సీఎం దృష్టికి చేరవేస్తామని చెప్పారని తెలియజేశారు. కలసిన వారిలో రాష్ట్ర ఉపాధి హామీ ఉద్యోగుల చైర్మన్ ఎలబద్రి లింగయ్య గారు కో-చైర్మన్‌లు మురహరి విజయ్, వెంకట్రామిరెడ్డి, అంజిరెడ్డి, మోహన్ రావు, రఘు, గిరి గౌడ్, నాగభూషణం తదితరులు ఉన్నారు.
- Advertisement -



