జడ్జీల తీర్పుల్లో అనవసర వ్యాఖ్యానాలు వద్దు: సుప్రీం కోర్టు

Supreme-Courtనవతెలంగాణ – హైదరాబాద్
జడ్జీలు తాము వెలువరించే తీర్పుల్లో వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు ఉపదేశాలివవ్వడం కానీ చేయొద్దని సుప్రీం కోర్టు తాజాగా సూచించింది. ఈ క్రమంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. లైంగిక కోర్కెలను నియంత్రించుకోవాలంటూ టీనేజ్ బాలికలను, మహిళలను గౌరవించడం నేర్చుకోవాలంటూ టీనేజ్ బాలురకు కలకత్తా హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఇవి అనవసరమై, తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలంటూ జస్టస్ అభయ్ ఎస్. ఓకే, జస్టిస్ పంకజ్ మిత్తల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం, ఇటువంటి కామెంట్స్ కిశోరప్రాయుల హక్కుల ఉల్లంఘన పరిధిలోకి వస్తాయన్న సర్వోన్నత న్యాయస్థానం కేసును జనవరి 4కు వాయిదా వేసింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే, తననే పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేసేందుకు నిందితుడు మహిళను కిడ్నాప్ చేశాడు. అయితే, ఈ కేసులో నిందితుడికి పోక్సో చట్టం సెక్షన్ 6 ప్రకారం శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సంరద్భంగా కలకత్తా హైకోర్టులోని జస్టిస్ చిత్తరంజన్ దాస్, జస్టిస్ పార్థసారథి సేన్ ధర్మాసనం ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది.

Spread the love