ప్రైమరీ బోధనకు బీఈడీలు అర్హులు కాదు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : బీఈడీ అభ్యర్థులు ప్రాథమిక పాఠశాలల్లో బోధించడానికి అర్హులు కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. చిన్న పిల్లలకు ప్రాథమిక విద్య బోధించడానికి ప్రత్యేక శిక్షణ ఉంటుందని, ఆ శిక్షణ పొందిన వాళ్లే అర్హులని స్పష్టం చేసింది. బీఈడీ చదివిన వాళ్లు కూడా ప్రాథమిక తరగతుల బోధనకు అర్హులేనంటూ ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి (ఎన్‌సిటిఇ) 2018లో ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజాగా ఆ నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాజస్థాన్‌ హైకోర్టు ఇప్పటికే మండలి నోటిఫికేషన్‌ను కొట్టేయగా, కొంతమంది బిఇడి అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు కూడా రాజస్థాన్‌ హైకోర్టు తీర్పును సమర్థించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల నియామకాలు వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది.

Spread the love