కాంగ్రెస్ కిసాన్ మండల అధ్యక్షుడిగా సురకత్తుల పెద్దన్న

నవ తెలంగాణ- నవీపేట్: కాంగ్రెస్ మండల కిసాన్ అధ్యక్షుడిగా నిజాంపూర్ ఉపసర్పంచ్ సురకత్తుల పెద్దన్నకు మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి బుధవారం నియామక పత్రాన్ని అందించారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశాన్ని నిర్వహించగా కాంగ్రెస్ కిసాన్ కమిటీ బాధ్యతలను పెద్దన్నకు అప్పగించారు. ఈ సందర్భంగా రైతుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు, మండల నాయకులు ఉన్నారు.
Spread the love