సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థిని అనుమానాస్పద మృతి

– గురుకుల పాఠశాలలో కుటుంబీకులు పెద్ద ఎత్తున ఆందోళన
– ఎస్సై, సీఐ, డీఎస్పీ, ఆర్ డి ఓ విచారణ

– విద్యార్థిని మృతికి కళాశాల ప్రిన్సిపాలే కారణమంటూ బంధువుల ఆరోపణ
నవతెలంగాణ- మద్నూర్:
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామపంచాయతీ పరిధిలోని గేటు వద్ద గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో మంగళవారం ఉదయం మొదటి సంవత్సరం చదువుకునే వసుధ
ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఆమె ముదిరాజ్ గ్రామం మానేపూర్ మండలం బిచ్కుంద మోనోటరి బ్లాక్ గదిలో ఉరి వేసుకొని ఫ్యానుకు వెల్లాడుతుంది. ఇది అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు బంధువులు పెద్ద సంఖ్యలో కళాశాలకు తరలివచ్చి ఆందోళన చేపడుతున్నారు. విద్యార్థి మృతి కళాశాల ప్రిన్సిపాలే కారణం అంటూ ఆందోళన చేస్తున్నారు. విద్యార్థిని మృతి పట్ల బాన్సువాడ డి.ఎస్.పి, బాన్సువాడ ఆర్డిఓ, బిచ్కుంద సీఐ, మద్నూర్ ఎస్సై విచారణ చేపడుతున్నారు. మృతికి గల కారణాలు తెలిపే వరకు ఆందోళన విరమించమని విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
Spread the love