– గ్రామల పారిశుధ్య పరిరక్షణకు కొనసాగుతున్న కార్యక్రమాలు
– నేటితో 15 రోజులు పూర్తి
– నేడు గ్రామాలలో గ్రామసభలు
– జిల్లాలో 475 గ్రామ పంచాయతీల్లో నిర్వహణ
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
పల్లెల్లో పారిశుద్ధ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో మహత్మాగాంధీ జయంతి సందర్భంగా గ్రామాల్లో ప్రత్యేక కార్యక మాలు నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పారిశుధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే స్వచ్ఛ గ్రామాలు రూపుదిద్దుకుంటాయని గాంధీజీ ఆనాడే అన్నారు.ఆయన జయంతి సందర్భంగా పంచాయతీల్లో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ2021, అక్టోబర్ 2న శ్రీకారం చుట్టారు.2023 స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా స్వచ్ఛ హీ సేవ కార్యక్రమం నేటితో ముగియనుంది.స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో స్వచ్ఛతా కార్యక్రమాలను అమలు చేశారు.జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రత్యేక కార్యాచరణకు చర్యలు..
జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యాచరణ అమలుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.ప్రధానంగా, గ్రామాల్లో అంగన్వాడీ పాఠశాలలు తదితర ప్రజా ప్రయోగ ప్రదేశాల్లో ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్యపనులు పూర్తయ్యాయి.చెత్తాచెదారం, కాలువల్లో పేరుకున్న మురుగును శుభ్రం చేశారు.పంచాయతీ పాలకవర్గాలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలతో శ్రమదానాలు నిర్వహించారు.పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కంపోస్టు షెడ్లలో తడి, పొడి చెత్త వేరుచేయడంతో పాటు సేంద్రియ ఎరువులు తయారు చేయడంపై దష్టి సారించారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే గ్రామ సభల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని తీర్మానం చేయనున్నారు.అన్ని పంచాయతీల్లో ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించేలా కార్యచరణ రూపొందించారు.దానికి ప్రత్యామ్నాయంగా కాగితం, వస్త్రం, జూట్ సంచులు వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నారు.
రోజుల వారీగా చేపట్టిన కార్యక్రమాలు ఇలా…
సెప్టెంబర్ 17 ఆదివారం స్వచ్ఛ ఆదివారంగా నిర్వహించి ప్రతిగ్రామ పంచాయతీలో కనీసం 100 మందితో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు.18న పర్యావరణ హితమైన పండగలపై యువత, మహిళా సంఘాలచే సమావేశాలు నిర్వహించారు.19 న చెత్త నిర్వహణ విధానంపై ఒక గంట పాటు బోధించడం, విద్యార్ధులు, యువకులచే స్వచ్చ ప్రతిజ్ఞలు, ర్యాలీలు,స్వచ్ఛ నడక, గ్రామంలోని డంపింగ్ యార్డు సందర్శింణ, వర్మి కంపోస్ట్ తయారీ గురించి చర్చించారు.వ్యర్థాల నిర్వహణ, ఆస్తుల రిపేరు, మరమ్మతులు, ట్రాక్టర్,ట్రాలీ, డంపింగ్ యార్డ్,ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు పెయింటింగ్‌చే అలంకరణ మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు.20న స్వచ్ఛత పై విద్యార్ధులు, యువతకు చిత్ర లేఖనం, క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన, పలు రకాల పోటీలు, మహిళలకు రంగోలి ఇతర పోటీలు నిర్వహించారు.అలాగే విజేతలను సన్మానించి, బహుమతులు ప్రదానం చేశారు.21గురువారం స్వయం సహాయక మహిళాలచే ప్రత్యేక సమావేశాలు, స్వచ్చత సమ్మేళనాలు,శ్రమదానం,ఇంటి వద్దనే తడి, పొడి చెత్త వేరు చేయడంపై చర్చ కార్యక్రమాల పై అవగాహన కల్పించారు.అదేవిధంగా 22న గుడ్ ఫ్రైడే ను నిర్వహించారు.23న ప్రతీ ప్రభుత్వ, ఇతర సంస్థలలో శ్రమదానం,వ్యర్ధాల నిర్వహణ సమర్ధవంతంగా చేపడుతున్న ఉత్తమ సంస్థలను గుర్తించి సన్మానించడం, గ్రామంలో చెత్త వేసే ప్రదేశాలను గుర్తించి తొలగించడం, కళా జాత కార్యక్రమాలచే స్వచ్చతపై అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.అదే విందగా నేటి వరకు జరుగనున్న కార్యక్రమాల వివరాలు రాష్ట్ర గ్రామీణాభివద్ది శాఖ అధికారులు విడుదల చేయనున్నారు.
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుతాం
డీఆర్డీఏ పీడీ -కిరణ్‌కుమార్
అన్ని గ్రామ పంచాయతీలు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.పల్లెల్లో స్వచ్ఛతకు ప్రాధాన్యమిచ్చేలా పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేశాం. మొక్కుబడిగా కాకుండా ప్రత్యేక శ్రద్ధతో పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాం. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దు తున్నాం.