Wednesday, September 16, 2026
E-PAPER
Homeజాతీయంటేకాఫ్‌ అవుతుండగా స్విస్‌ విమానంలో మంటలు

టేకాఫ్‌ అవుతుండగా స్విస్‌ విమానంలో మంటలు

- Advertisement -

– ఎమర్జెన్సీ ప్రకటించిన ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు
న్యూఢిల్లీ :
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ అవుతుండగా విమాన ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఢిల్లీ విమానాశ్రయం పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
అసలేం జరిగిదంటే?
అధికారుల వివరాల ప్రకారం, ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో జరిగింది. స్విస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన స్విస్‌ ఎయిర్‌ ఫ్లైట్‌ ఎల్‌ఎక్స్‌147 ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి స్విట్జర్‌ల్యాండ్‌లోని జ్యూరిచ్‌కు బయల్దేరడానికి సిద్ధమైంది. టేకాఫ్‌ అవుతున్న సమయంలో విమానంలో ఎడమ చక్రం వద్ద మంటలు చెలరేగాయి. వెంటనే విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించేశారు. అత్యవసర స్లైడ్లను ఉపయోగించి కిందకు దించుకున్న సమయంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విమానంలో మొత్తం 232 మంది ప్రయాణికులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -