వికాసిత్ భారత్ సంకల్ప యత్రలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తాడు బిలోలి సర్పంచ్ వేల్మల సునీత నరసయ్య, గ్రామ ప్రజలను కోరారు. శనివారం మండలంలోని తాడిబిల్లి గ్రామంలో వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 17 శాఖల అంశాలకు సంబంధించిన అధికారులు పథకాల గురించి వివరించడం జరిగిందని, ఈ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇల్లు లేని నిరుపేదలు, ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ వాడని వారికి ఉచితంగా సిలిండర్లు అందజేయడం జరుగుతుందని ఆమె అన్నారు. వైద్య ఆరోగ్యం, తాగునీరు, ఆహార భద్రత భరోసా, సుకన్య సమృద్ధి యోజన, ఉజ్వల యోజన, అటల్ పెన్షన్, రైతు సంక్షేమానికి భరోసా లాంటి పథకాలను ప్రవేశపెట్టిందని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చింతకుంట లక్ష్మి, ఎంపీడీవో శంకర్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, బ్యాంకు మేనేజర్ లక్ష్మీనారాయణ శాస్త్రి, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి, మిషన్ భగీరథ గబ్బర్ సింగ్, వైద్య సిబ్బంది కరిపే రవీందర్, లక్ష్మీనారాయణ, సి సి కృష్ణ, గ్రామ కార్యదర్శి రాఘవేందర్ గౌడ్, ఫ్యాక్ట్ కంపెనీ నిర్వాహకులు నీలిమ, స్థానిక డీలర్ పార్వతీ రాజేశ్వర్, కారో బార్ అనంతరావు, అంగన్వాడి కార్యకర్తలు కరుణ ,రాజమణి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు..