Sunday, May 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి

స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

ఎండి సయ్యద్
నవతెలంగాణ – ఆలేరు రూరల్

విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల ద్వారా భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎస్‌ఎల్ ఫౌండేషన్ నిర్వాహకులు,ఉపాధ్యాయులు  ఎండి సయ్యద్ సూచించారు.ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో  ఎస్‌ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎండి సయ్యద్ మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం స్థాపించిన ఎస్‌ఎల్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థుల అభివృద్ధికి దోహదపడే విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ భాషపై పట్టు ఎంతో అవసరమని, విద్యార్థులు చిన్న వయస్సు నుంచే భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు.రోజువారీ జీవితంలో ఇంగ్లీష్ భాష వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు భయాన్ని విడిచిపెట్టి మాట్లాడే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు.ఈ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి భవిష్యత్తుకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మందనపల్లి గ్రామ సర్పంచ్ రేణుక నరసయ్య, ఉపసర్పంచ్ పద్మ శశిరేఖ సుదర్శన్, గ్రామపంచాయతీ కార్యదర్శి ఇందిరా, వీఆర్వో యాదగిరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -