Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తీవ్ర ఎండల పట్ల జాగ్రత్తలు పాటించండి: ఎమ్మెల్యే

తీవ్ర ఎండల పట్ల జాగ్రత్తలు పాటించండి: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా వడదెబ్బ సోకకుండా నియోజకవర్గ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని ఆదివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు విజ్ఞప్తి చేశారు. అవసరమైతేనే బయటకు రావాలని, గొడుగు వాడాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్దులు వీలైనంత వరకు ఇండ్లలోనే ఉండాలని చెప్పారు. ఎప్పటికప్పుడు ఎండల తీవ్రత పెరుగుతోందని అన్నారు. ప్రతి ఒక్కరు తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -