కంట్రోల్‌ చేసుకోవచ్చిలా…!

Take control...!బరువు తగ్గడానికి అందరికీ ఒకే విధమైన డైట్‌ ఉంటుందని చెప్పలేం. అది జీవన విధానాలు, శారీరక తీరు, అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అయితే బరువు సమతూకంగా ఉండి, చక్కని ఆరోగ్యం కోసం మాత్రం ఓ ప్రణాళిక ఎంతైనా అవసరం. అందుకోసం డైట్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే…

 ధాన్యాలు, పప్పులు, తణ ధాన్యాలు, పండ్లు, నట్స్‌, గింజలు ఆహారంలో భాగంగా తీసుకోవాలి.
రిఫైండ్‌ పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండడం ఉత్తమం. కొవ్వు పదార్థాలు బాగా తగ్గించాలి.
నువ్వుల్లో ఐరన్‌ చాలా అధికంగా లభిస్తుంది.
కూరగాయల రసాలు ఆహారంలో భాగం చేసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు బాగా లభిస్తాయి. కీరా, టమాటా, క్యారెట్‌, బీట్‌ రూట్‌ వంటి రసాలు ఎక్కువగా తాగుతుండాలి.
పీచు పదార్థాల శాతాన్ని బాగా పెంచాలి. పండ్లు, కూరగాయలలో పీచు సహజంగానే ఎక్కువగా ఉంటుంది. కనుక వీలైనంత అధికంగా తీసుకోవాలి. జొన్నలు, రాగులు, ముడిబియ్యం, సజ్జలు వంటి ధాన్యాల వాడకం పెంచాలి. జొన్న, సోయా, సజ్జల రోటీలలో పీచు అధికంగా లభిస్తుంది.
ఎవరైనా సరే ఉదయాన్నే మంచి ఉపాహారం తీసుకోవాలి. రోజంతా చురుగ్గా పనిచేయడానికి ఇవి చాలా అవసరం. సరైన వేళకు భోజనం చేస్తుండాలి. రాత్రి పూట త్వరగా భోజనం చేయాలి. దీని వల్ల రాత్రి పడుకునే సమయానికి ఆకలి వేస్తే ఓ గ్లాసు పాలు తాగాలి.
కొద్దిగా బాదం పప్పు తినడం లేదా ఒక కప్పు సూప్‌ తాగడం చేయవచ్చు. డైటింగ్‌లో ఉన్న వారికి కమలాలు మంచి ఆహారం. పుచ్చకాయ రసం కూడా బాగా మేలు చేస్తుంది. బాదం పప్పులు కొవ్వును పెంచుతాయని చాలా మంది భావిస్తారు. కానీ అవి చాలా శక్తినిస్తాయి. పోషకాలు, పీచు, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, జింక్‌ పుష్కలంగా ఉండే బాదం పప్పులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
బరువు అదుపులో వుండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుండాలి. ఏ వ్యాయమాన్ని ఇష్టపడితే దాన్ని చేయవచ్చు.
ఏ రకమైన ఆరోగ్య సమస్యలు లేని వారికి వాటర్‌ థెరపి బాగా పని చేస్తుంది. మామూలు నీరైనా, వేడి నీరైనా కొద్దిగా అల్లం లేదా నిమ్మరసం కలుపుకుని తాగితే బాగా పనిచేస్తాయి.

Spread the love