Tuesday, June 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎల్‌‌నినో నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టండి

ఎల్‌‌నినో నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టండి

- Advertisement -


జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయండి
రైతులకు వాతావరణ ఆధారిత సాంకేతిక సలహాలివ్వాలి : వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్‌
‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలనీ, జిల్లాల వారీగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్రమోహన్‌ ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేద్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆయన సమీక్ష‍ నిర్వహించారు. వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్‌ ‌బి.గోపి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, సహకార, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేంద్రమోహన్‌ ‌మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదయ్యే అవకాశాలున్నందున అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోటు వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలు, విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరా, నీటి సంరక్షణ చర్యలు, రైతులకు అవగాహన కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తక్కువ నీటి అవసరమున్న పంటల సాగుపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.వాతావరణ శాఖ సూచనలను నిరంతరం పరిశీలిస్తూ రైతులకు క్షేత్రస్థాయిలో సకాలంలో సాంకేతిక సలహాలు అందించాలని, వ్యవసాయ విస్తరణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. రైతులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారులతో ఇదే అంశంపై వీడియో కాన్ఫరెన్స్‌ ‌నిర్వహించారు. జూన్ 4 ,6, 8, 10, తేదీలలో నిర్వహించే ప్రత్యేక గ్రామసభల నందు రైతువేదికలలో నిర్వహించే సమావేశాల్లో ఈ అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -