సర్కారు జీవో జారీ
వృత్తినిర్వహణలో ఆటంకాలు లేకుండా రక్షణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్
తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం రాష్ట్రంలోని న్యాయవాద వృత్తి నిపుణులకు వారి వృత్తిపరమైన విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో హింస, నేరపూరిత బెదిరింపులు, వేధింపులు దురుద్దేశపూర్వక ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ మేరకు జీవో 41ని రాష్ర్ట ప్రభుత్వ న్యాయ, లేజిస్ర్టేటివ్ వ్యవహారాల కార్యదర్శి బి. పాపిరెడ్డి జారీ చేశారు. రాష్ర్టంలో చోటుచేసుకున్న ఆయా సంఘటనల నేపథ్యంలో న్యాయవాదులు, వారి సంఘాల పోరాటం మేరకు ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టంపై సమగ్రంగా చర్చించింది. అనంతరం చట్టంగా రూపొందించి గవర్నర్ ఆమోదం తీసుకుని అమల్లోకి తెచ్చింది. రాష్ర్ట అవతరణ దినోత్సవం నేపథ్యంలో అమల్లోకి తేవాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇదిలావుండగా త్వరలో గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది.
చట్టంలోని కీలకాంశాలు
హింస నుంచి రక్షణ: ఈ చట్టం ప్రకారం, ఒక న్యాయవాదిపై లేదా వారి కుటుంబంపై దాడి, బలవంతం, లేదా నేరపూరిత బెదిరింపులకు పాల్పడినా శిక్షార్హులు. ఈ నేరాలకు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే రూ.25,000 నుంచి రూ. 50,000 వరకు జరిమానాలు విధిస్తారు. కఠినమైన చట్టపరమైన రక్షణలు: ఈ చట్టం కింద అన్ని నేరాలు విచారణార్హమైనవిగా పరిగణిస్తారు. అలాగే బెయిల్‌కు అర్హత ఉండదు. అంతేకాకుండా, ఈ చట్టం కింద నమోదు చేయబడిన పోలీసు కేసులను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ), అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఎసీపీ) హోదాలో ఉన్న అధికారులు మాత్రమే దర్యాప్తు చేస్తారు. అరెస్టు నుంచి మినహాయింపు: ఇకపోతే న్యాయవాదులు గుర్తించదగిన నేరం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే తప్ప, మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు న్యాయ ఉత్తర్వు లేకుండా ఆరోపించబడిన నేరాలకుగాను న్యాయవాదులను అరెస్టు చేయడం గానీ, కస్టడీ విచారణకు పిలవడం గానీ చేయడం సాధ్యం కాదు. ఈ మేరకు చట్టం రూపొందింది.
చట్టం చేయడం సంతోషకరం .. లోపాలూ సవరించాలి
అఖలి భారత న్యాయవాదుల సంఘం(ఐలు) రాష్ర్ట అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కె.సత్యనారాయణ,కె పార్థసారథి న్యాయవాదుల రక్షణకు చట్టం చేయడం సంతోషం. ప్రభుత్వానికి ధన్యవాదాలు. అసెంబ్లీలో చర్చించారు. కానీ, లోపాలు ఉన్నాయి. సవరించాల్సిన అవసరముంది. వృత్తికి ఆటంకం లేకుండా ఈ చట్టం పక్కాగా అమలు చేయాలి. దాడులు, వేధింపుల నుంచి రక్షణ కల్పించాలి. ఆమేరకు చట్టాన్ని అమలుచేస్తూ న్యాయవాదులకు నమ్మకాన్ని కల్పించాలి. మహిళా న్యాయవాదులపై కూడా దౌర్జన్యాలు సాగుతు న్నాయి. వీటిని సహించకూడదు. లాయర్లపై అడ్డగోలుగా ఫిర్యాదులు స్వీకరిం చకూడదు. బోగస్ ఫిర్యాదులే ఎక్కువగా వస్తాయి. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి.
కేంద్రమూ చట్టం చేయాలి
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్
న్యాయవాదులు, సంఘాల పోరాటాలు, ఉద్యమాల మేరకు ఈ చట్టం చేయడం సంతోషం. సంపూర్ణ రక్షణ కల్పించకున్నా అడ్వకేట్లకు ఈచట్టం కొంత మేలు చేస్తుంది. రాష్ర్టంతోపాటు దేశంలోనూ న్యాయవాదులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వీటి నుంచి న్యాయవాదులను కాపాడాలి
స్వాగతిస్తున్నాం
హైకోర్టు సీనియర్ అడ్బకేట్ రాపోలు భాస్కర్
న్యాయవాదుల రక్షణకు రాష్ర్ట ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి చట్టం చేయడం సంతోషం. అమల్లోకి తేవడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్టంలోనూ, దేశంలోనూ న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్నీ కోర్టుల్లోని అడ్వకేట్లకు ఇది ప్రయోజనం కలిగిస్తుం ది. న్యా యవాదులపై పోలీసులు కేసులు పెట్టే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
అమల్లోకి తెలంగాణ న్యాయవాదుల చట్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



