బీజేపి కలిసి వస్తుందో, రాదో తెలీదు : హైదరాబాద్ లో పవన్‌కళ్యాణ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
‘ఇటీవల కొంత మంది హైదరాబాద్‌లో ఎలా అడుగు పెడతావ్.. ఇక్కడ మీకేం పని అని నన్ను అడుగుతున్నారు’ అని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్ అన్నారు. ‘ అసలు మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి’’ అని ఆయన ప్రశ్నించారు. ‘బెదిరించేవాళ్ల అయ్యా జాగీరా’…తెలంగాణ అని ఎదురుదాడి చేశారు. 2029 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామనీ, బీజేపీ తమతో కలిసి వస్తుందో లేదో తెలియదన్నారు. మంగళవారం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘తెలంగాణపై నాకు ఎంతో ప్రేమ ఉంది. అది రాజకీయాలకు అతీతమైంది. నాపై దాడులు చేస్తామంటున్నారు అందుకే నా ఇంటి అడ్రస్ తెలియాలి’ అనే ఇక్కడ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ‘నాకు తెలంగాణలో బెదిరింపుల కన్నా ఆంధ్రాలోనే బెదిరింపులు ఎక్కువ అని గుర్తు చేశారు. అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రజలు నాకు అండగా నిలిచారనీ, జనసేనను తెలంగాణ నడిబొడ్డున ఏర్పాటు చేశాం’ అని అన్నారు. ‘నాది అధికారంపై ప్రేమ కాదు… తెలంగాణలో మార్పు పైనే ప్రేమ అని’ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రాపై విద్వేషం లేదని తెలిపారు. తెలంగాణ ప్రజలు ద్వేషం పెంచుకుంటే, ఒక్క ఏపీ వ్యక్తి కూడా ఇక్కడ ఉండేవారు కాదన్నారు. నేను తెలంగాణ వ్యతిరేకిని కాదనీ, విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకినని చెప్పారు. పార్లమెంటు తలుపులు మూసి విభజించిన తీరు తప్పని పునరుద్ఘాటించారు. తెలంగాణ వ్యతిరేకం అని వైఎస్‌ఆర్ చెప్పినా, ఆయనకు ఊడిగం చేశారని పరోక్షంగా కాంగ్రెస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నోసార్లు తగ్గి ఉన్నా. గద్దర్ బతికున్న రోజుల్లో మీరంతా ఎక్కడ ఉన్నారు? గద్దర్ వచ్చి తనకు బండి కొనివ్వాలంటే, రెండు రోజుల్లో కొనిచ్చాను. గద్దర్ బతికి ఉన్న రోజుల్లో ఆయనకు మీరు ఏం చేశారు?’ అని ప్రశ్నించారు. ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్ల గొడవ మొదలైంది. ఆ విశ్లేషకుడిపై కేసులు పెట్టిన విషయం నాకు మొదట్లో తెలియదు. నాకు తెలిశాక కేసులు వద్దు వదిలేయమని చెప్పా. ఆ తర్వాత ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి నన్ను తిట్టారు. తెలంగాణలో ప్రతి సమస్యకు ఆంధ్రావారే కారణమా’ అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి చెబుతున్నా.. ‘ఒకవేళ నేను భూమి కబ్జా చేశానని నిరూపణ అయితే, దాన్ని స్వాధీనం చేసుకోవాలి’ అని కోరారు. కేవలం రెండువేల మందితో సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వరా? విశ్లేషకులు ఇష్టానుసారం మాట్లాడినా తమ అభిప్రాయం చెప్పకూడదా? అని ప్రశ్నించారు. ‘పాశం యాదగిరి అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఇదే ఇంట్లో కూర్చొని నేను రెండూ మూడు గంటలు మాట్లాడాను. అలాంటి వ్యక్తి తిడుతుంటే బాధేసింది’ అని అన్నారు. ప్రాంతీయత పేరుతో జాతీయ వాదాన్ని బలహీన పరిస్తే జనసేన అంగీకరించబోదని ఆయన హెచ్చరించారు. తెలుగు ప్రజల ఐక్యతకు బూర్గుల రామకృష్ణారావు చిహ్నమన్నారు. ఏపీ-తెలంగాణ హైవేకు బూర్గుల పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ రాష్ట్రమేమైనామీ అయ్య జాగీరా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



