జిల్లాస్థాయి కళా ఉత్సవంలో కస్తూర్బా విద్యార్థుల ప్రతిభ

నవతెలంగాణ- కమ్మర్ పల్లి:  మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు జిల్లా స్థాయి కళా ఉత్సవంలో తమ ప్రతిభను చాటుకున్నారు. శుక్రవారం జరిగిన ఫోక్ డాన్స్ విభాగంలో విద్యార్థిని ఆర్. నందిని ఉత్తమ  ప్రతిభ కనబరిచి మొదటి బహుమతిని గెలుపొందింది.  అదేవిధంగా సోలో డ్రామా విభాగంలో బి. మహిత అత్యుత్తమ ప్రతిభను కనబరచడం ద్వారా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాస్థాయి కళ ఉత్సవంలో పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడం ద్వారా మొదటి బహుమతి సాధించడం పట్ల పాట గోశాల ప్రత్యేక అధికారిని గంగమణి  హర్షం వ్యక్తం చేశారు.  ఉత్తమ ప్రతిభ కనబరిచిన నందిని, మహితను  ప్రత్యేక అధికారిణి తోపాటు  ఉపాధ్యాయులు అభినందించారు.
Spread the love