పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన తమిళనాడు పసుపు రైతులు

నవతెలంగాణ కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ పసుపు పరిశోధన కేంద్రాన్ని తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ ప్రాంత పసుపు రైతులు బుధవారం సందర్శించి పరిశీలించారు. పసుపు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మహేందర్ పసుపు సాగులో ఆధునిక పద్ధతుల గురించి తమిళనాడు పసుపు రైతులకు వివరించారు. శాస్త్రవేత్త శ్రీనివాస్ పసుపు కోత తర్వాత యాజమాన్య పద్ధతులను వివరించారు. కేంద్రంలో జరుగుతున్న పరిశోధనలను, పసుపు సాగులో పాటించాల్సిన మెలకువలను రైతులు శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో స్పైసీస్ బోర్డ్ సూపరింటెండెంట్ రామాణిక్యం, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love