పాలసీదారులకు మెరుగైన సేవలే టాటా ఏఐఏ లక్ష్యం

– మిర్యాలగూడలో టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నూతన బ్రాంచ్‌ ప్రారంభం
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలోని వీఆర్‌ గ్రాండ్‌ పక్కన మెయిన్‌ రోడ్డు, హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నూతన బ్రాంచ్‌ను బుధవారం నిర్వాహకులు, బ్రాంచ్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఏజెన్సీ శీతాకాంత మోహ పత్ర, డైరెక్టర్‌ ఆఫ్‌ ఏజెన్సీ భరణి ఏరాడ, డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఏజెన్సీ యాదగిరి, ట్రైనింగ్‌ హెడ్‌ శ్యాం ప్రసాద్‌ హాజరై నూతన కార్యాలయాన్ని రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిర్యాలగూడ బ్రాంచ్‌ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు అందించడంతోపాటు సంస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కష్టపడుతున్నారని వారన్నారు. దేశంలో దాదాపు 540 బ్రాంచీలు, 226 ఆఫీసులు ఉన్నాయన్నారు. వినియోగ కేంద్రాల ఏర్పాటు ద్వారా పాలసీదారులకు మంచి ప్రయోజనాలు ఉన్నాయని, ప్రజల ప్రయోజనార్ధమే మిర్యాలగూడలో చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. టాటా ఏఐఏలో కష్టపడే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజినెస్‌ అసోసియేట్‌ మేనేజర్‌ బానోత్‌ బాబు, సిబ్బంది, ఏజెంట్ల బందం తదితరులు పాల్గొన్నారు.

Spread the love