
నవతెలంగాణ – డిచ్ పల్లి
గ్రామంలో పేరుకుపోయిన ఇంటి పన్నుల వసూళ్లకు ఇంటింటికి తిరుగుతున్నప్పుడు గ్రామస్తులు సిబ్బంది కి తమవంతు సహకారం అందజేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీదర్ అన్నారు. శుక్రవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో పేరుకుపోయిన బకాయి లను వసులు చేయడానికి పంచాయతీ సిబ్బంది తో కలిసి ఇంటింటికి తిరుగుతూ వసూలు చేస్తున్నా మన్నారు.ఈ సందర్భంగా కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో డబ్బులు ఉంటేనే గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఇదే కాకుండా వేసవి లో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ దీపాలు, తదితరులు పనులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పన్ను వసూళ్లు చేయడం జరుగుతుందని, గ్రామ ప్రజలు సహకరించి,ఇంటి పన్నులు, వ్యాపార సముదాయాలు ప్రతి ఏటా లైసెన్స్ లను పునరుద్ధరణ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరోబార్ పిల్లి నరేందర్, భాస్కర్, గంగారాం, తోపాటు పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.