ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ చేరిన టీడీపీ మండల అధ్యక్షుడు

నవతెలంగాణ- పెద్దవంగర: టీడీపీ మండల అధ్యక్షుడు ఉప్పెరగూడెం గ్రామానికి చెందిన బైన బిక్షపతి గురువారం బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ఎర్రబెల్లి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛంద పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మొద్దన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుంపల సమ్మయ్య, బొమ్మెరబోయిన రాజు, దుంపల వేణు, ఎండీ షర్ఫీద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love