అక్రమంగా మట్టి తరలిస్తేచర్యలు తప్పవు: తహసీల్దార్

నవతెలంగాణ – శంకరపట్నం
అక్రమంగా జేసీబీలతో మట్టి తరలించే వ్యక్తిపై చట్టం ప్రకారం  చర్యలు తీసుకున్నట్లు, శనివారం మండల తాసిల్దార్ జోగినపల్లి అనుపమ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన సిహెచ్ శ్రీనివాసు ప్రభుత్వ భూమిలో అక్రమంగా జెసిబి తో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలించాడని రూ.50,000 రూపాయల జరిమానా విధించినట్లు తహసీల్దార్ అనుపమ తేలిపారు, ఏలాంటి అనుమతులు లేకుండా చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని తాసిల్దార్ అనుపమ రావు తెలిపారు.

Spread the love