తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్‌ఎస్‌లో అవమానాలు

– కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య
నవతెలంగాణ-ఆలేరు టౌను
తెలంగాణ ఉద్యమకారులకు బిఆర్‌ఎస్‌ పార్టీలో అవమానాలు జరిగాయని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శినియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ఆలేరు పురపాలక సంఘంలోని బిజెపి వార్డు కౌన్సిలర్‌ సంగు భూపతి స్వతంత్ర వార్డు కౌన్సిలర్‌ గుత్త శమంత రెడ్డి, ముదిగొండ. శ్రీకాంతు, మన్నే సంతోష్‌, తమ అనుచరులతో కలిసి ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గం లోని పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమ నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి , కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు సూత్రాల హామీలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని చెప్పారు. బిఆర్‌ఎస్‌ పార్టీలో నియంతత్వ పోకడ పెరిగింది అన్నారు. సునీతా మహేందర్‌ రెడ్డికి అడుగులకు మడుగులొత్తే వారే బిఆర్‌ఎస్‌ లో ఉన్నారన్నారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కాలే. సుమలత అంజయ్య ఆధ్వర్యంలో రాజపేటలో గురువారం సుమారు 1000 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారని పేర్కొన్నారు . ఆలేరు , బొమ్మలరామారం, గుండాల, మోటకొండూరు, ఆత్మకూరు, రాజాపేట, యాదగిరిగుట్ట, మోట కొండూరు ,తుర్కపల్లి, మండలాలలో చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రజల పుణ్యాన , పదవి, డబ్బు రాగానే అహంకారం నెత్తికెక్కిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. నియోజకవర్గంలో అభివద్ధి ఉంటూ పడిందని, ఆలేరు మున్సిపాలిటీగా, ఏర్పడినప్పటికీ ,అభివద్ధిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉందన్నారు. ఆలేరు పట్టణం పాత బస్తిని తలపిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం. పద్మ వెంకటస్వామి, ఎంపీపీ గంధ మల్ల. అశోక్‌, మండల, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, కొండరాజు. వెంకటేశ్వరరాజు, ఎంఏ. ఎజాజ్‌,వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిరిగిరి. విద్యాసాగర్‌,పట్టణ పాము. అనిత, ఎ .లత, దుసరి ఆంజనేయులు, దుసరి మురళీధర్‌, కుల.నరసింహులు, పోరల్ల. సతీష్‌,అదష్ట రావు, శేషగిరిరావు,గనగాని వెంకటేష్‌, బెదరకోట రమేష్‌, బీజన భాస్కర్‌, మల్లెల శ్రీకాంత్‌ ఎగ్గీడి శ్రీశైలం, ఎగిడి యాదగిరి, ఎగిడి మల్లయ్య, కలకుంట్ల లోకేష్‌, పరే రమేష్‌, ఎండి బాబా మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love