8గంటలు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్ ప్రెస్

Telangana Express Trainనవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నేడు 8 గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నట్టు తెలిపింది. రోజూ ఉదయం ఆరు గంటలకు బయలుదేరే ఈ రైలు నేడు మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అందుకు అనుగుణంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. కాగా, ఢిల్లీ నుంచి 26న సాయంత్రం హైదరాబాద్ రావాల్సిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4 గంటలకు బదులుగా రాత్రి 7.05 గంటలకు బయలుదేరింది. 27న కూడా 8 గంటలు ఆలస్యంగా రైలు బయలుదేరింది. అయితే, రైలు ఆలస్యానికి కారణాన్ని మాత్రం రైల్వే అధికారులు వెల్లడించలేదు.

Spread the love