- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ జీపీ గ్రామంలో గ్రామ సర్పంచ్ వాగ్మారే రమణ సురేష్ గొండ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వారికి అర్పించారు. నీళ్లు , నిధులు, నియామకాలపై పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగిందని వాటికి ఎంతోమంది బలి అయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ జీపీ కార్యదర్శి భరద్వాజ్ , జీపీ కార్యవర్గ సభ్యులు, జిపిఓ , గ్రామ పెద్ద లు , మహిళా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



