తెలంగాణ పదేండ్ల కాలంలో వందేండ్ల అభివృద్ధి సాధించింది

కార్పొరేటర్‌ మందాడి శ్రీనివాసరావు
నవతెలంగాణ- కేపీహెచ్‌బీ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పదేండ్ల కాలంలో వందేండ్ల అభివృద్ధి సాధించిందని కేపీహెచ్‌బీ డివిజన్‌ కార్పొరేటర్‌ మందాడి శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దివ్యాంగులకు మరో వెయ్యి రూపాయలు అదనంగా పింఛను పెంచిన నేపథ్యంలో సోమవారం కేపీహెచ్‌బీ డివిజన్‌ కార్పొరేటర్‌ క్యాంప్‌ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి కార్పొరే ట్‌తోపాటు దివ్వాంగులు పాలాభిషేకం చేశారు. అనంతరం దివ్యాంగులను సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని మిగతా రాష్ట్రాలు అన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర ్‌ను తిరిగి నాయకుడిగా ప్రజలు మళ్లీ ఎన్నుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు ఆధ్వర్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గం ఆదర్శవంతంగా మారిందన్నారు. నేడు అన్ని మౌలిక సదుపాయాలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు కష్ణారెడ్డి ,జనరల్‌ సెక్రటరీ రాజేష్‌, హనుమంతరావు ,రాంబాబు నాయుడు, పాతూరి గోపి, భవాని, భారతి ,రమాదేవి, లతా ,పద్మా రెడ్డి, వెంకట్‌ రెడ్డి హేమ తదితరులు పాల్గొన్నారు.

Spread the love