వేములవాడలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

నవతెలంగాణ – వేములవాడ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు(దశాబ్ది ఉత్సవాలు) వేములవాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా రాజన్న ఆలయంలో ఇంచార్జ్ ఈవో రామకృష్ణ,  మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ రామతీర్థపు మాధవి-రాజు, డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ నాగేంద్ర చారి, పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ వీర ప్రసాద్, శ్రీనివాస్,  తహసీల్దార్ కార్యాలయాల్లో తహసీల్దార్లు మహేష్, సుజాత, ఎంపిడివో కార్యాలయాల్లో ఎంపీపీలు బూర వజ్రమ్మ-బాబు, బండ మల్లేశం యాదవ్, సెస్ కార్యాలయాలలో డైరెక్టర్లు నామాల ఉమ-లక్ష్మీ రాజాం, రేగులపాటి హరి చరణ్ రావు, ఆకుల దేవరాజం,  మిషన్ భగీరథ కార్యాలయంలో డి.ఈ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల  వ్యవసాయ శాఖ అధికారి సాయి కిరణ్, వెటర్నరీ కార్యాలయంలో డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, అటవీశాఖ కార్యాలయంలో రేంజ్ ఆఫీసర్ ఖలీల్ తో పాటు  బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ లు జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
Spread the love