నవతెలంగాణ భూదాన్ పోచంపల్లి
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని స్వరాష్ట్రంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని భువనగిరి శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం పోచంపల్లి మండలంలోని జూలూరు గ్రామంలో భవన శంకుస్థాపనలు అంబేద్కర్ యువజన సంఘం ప్రారంభోత్సవం పోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు ప్రగతి యువజన సంఘం భవన ప్రారంభోత్సవం చేసి అనంతరం ఆయన మాట్లాడారు. 9 ఏళ్ల కాలంలోని పోచంపల్లి అధిక నిధులు కేటాయించి ఎంతో అభివృద్ధి చేశామన్నారు. 11వ వార్డు కౌన్సిలర్ కుడికాలు అఖిల బలరాం మాట్లాడుతూ 11వ వార్డులో ఎమ్మెల్యే ద్వారా నిధులు తీసుకొచ్చి వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగులప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి వైస్ చైర్మన్ లింగస్వామి మండల పార్టీ అధ్యక్షులు పాటి సుధాకర్ రెడ్డి సింగల్ విండో చైర్మన్ కందాల భూపాల్ రెడ్డి సీత వెంకటేశం ప్రగతి యువజన సంఘం అధ్యక్షులు ఎలగందుల నరసింహ గౌరవాధ్యక్షులు సూర్య పల్లి రమేష్ మున్సిపల్ కౌన్సిలర్లు కుడికాల అఖిల బలరాం కర్నాటి రవి, గుండు మధు పెద్దల చక్రపాణి దేవరారు కుమార్ ద్వారెడ్డి మంజుల వేణుగోపాల్ రెడ్డి కొందరి కష్ణ సురకంటి జ్యోతి రంగారెడ్డి పాల్గొన్నారు.