బర్రెలక్కకు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బేషరతు మద్దతు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కకు భారీ మద్దతు లభిస్తోంది. అన్ని వర్గాలు ఆమె వెన్నంటి నిలుస్తున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆమెకోసం మద్దతు ప్రకటిస్తున్నారు. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సైతం ఆమె కోసం ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగులకు ప్రతినిధిగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిల్చున్న ఆమెకు తాజాగా తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సీనియర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహారావు ఫేస్‌బుక్‌ ద్వారా ప్రకటించారు. ‘మా రక్ష’ బర్రెలక్కకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తోందని ఆ పోస్టులో ఆయన పేర్కొన్నారు.

Spread the love