సెట్‌లలో తెలంగాణ ప్రొఫెసర్లను నియమించాలి

– జేఎన్‌టీయూహెచ్‌ జేఏసీ చైర్మెన్‌ బొట్ల భిక్షపతి
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
2024 లో నిర్వహించే సెట్‌ లలో తెలంగాణ ప్రాంత సీనియర్‌ ప్రొఫెసర్లను నియమించాలని జేఎన్‌టీయూహెచ్‌ జేఏసీ చైర్మెన్‌ బొట్ల భిక్షపతి కోరారు. గతంలో ఎంసెట్‌, ఈసెట్‌, పీజీ సెట్‌లలో తెలంగాణ వారికే ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జేయన్టీయు హెచ్‌ జేఏసీ చైర్మెన్‌ బొట్ల బిక్షపతి పాల్గొని మాట్లాడుతూ గతంలో నియమించిన ప్రో.దీనకుమారి, కోకన్వీనర్‌ ప్రో.విజయ్ కుమార్‌ రెడ్డి బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించినందువల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్‌ కె. విజయ్ కుమార్‌ రెడ్డి సింగరేణి అర్హత పరీక్షలో చేసిన అవకతవకలపై కోర్టు చుట్టూ తిరగవలసి వచ్చిందన్నారు. అతనికే జెన్కో, నర్సింగ్‌ అప్పగించి పలు అవినీతికి పాల్పడ్డారని, తెలంగాణ ప్రభుత్వం దీనిని దష్టిలో పెట్టుకొని 2024 సంవత్సరంలో తెలంగాణ ప్రాంత ప్రొఫెసర్లను నియమిస్తే సామర్థ్యం ఉన్న విద్యార్థులకు ర్యాంకులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ మళ్లీ వీరిలో ఎవరికైనా తెలంగాణ ప్రాంతీ యేతర ప్రొఫెసర్లకు కేటాయించినట్లయితే విద్యార్థి సంఘా లుగా తీవ్రంగా వ్యతిరేకించి, మరో ఉద్యమానికి పూనుకోవాల్సి వస్తదని హెచ్చరించారు. అద్యక్షులు మంద రంజిత్‌ కుమార్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బల్గర్‌ సందీప్‌, శ్రీను నాయక్‌, శ్రీనివాస్‌, ప్రణరు, బాలాజీ, విష్ణు, వినోద్‌, విక్రమ్‌ పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love