నేడు తెలంగాణ రన్‌ విజయవంతం చేయాలి

జిల్లా కలెక్టర్‌ అమోరు కుమార్‌
నవతెలంగాణ-మేడ్చల్‌ కలెక్టరేట్‌
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా ఈనెల 12వ తేదీన(నేడు) నిర్వహించే తెలంగాణా రన్‌లో యువతీ యువ కులు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ అమోరు కుమార్‌ అన్నారు. తెలంగాణ రన్‌ కార్యక్రమంపై జిల్లా అధికారులతో ఆదివారం కలెక్టరేట్‌లో అధికారులతో ముం దస్తు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్‌ కార్యక్రమాన్ని ‘చెంగిచర్ల చౌరస్తా నుంచి డీ కేథలాన్‌ పీర్జాది గూడ గ్రౌండ్‌ వరకు ఉదయం 6.00 గంటలకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ రన్‌లో పట్టణంలోని యువత, కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు, పోలీసులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర అవతరణ స్ఫూర్తిని ప్రతిబిం బించేలా ఈ రన్‌లో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లా రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.

Spread the love