టీజీఎస్ ఆర్టీసీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్…

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 3,035 ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ఉద్యోగాల భర్తీకి అనుమతి రావడంపై రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని  ఆయన తెలిపారు. వీటిలో 2000 డ్రైవర్‌ ఉద్యోగాలు, 743 శ్రామిక్‌ ఉద్యోగాలు ఉన్నాయి.

ఖాళీల వివరాలు:

  • డిపో మేనేజర్లు/అసిస్టెంట్ ట్రాఫిక్‌ మేనేజర్లు – 25
  • అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ – 15
  • డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84
  • డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) – 114
  • అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) – 23
  • సెక్షన్ ఇంజినీర్‌ (సివిల్): 11
  • అకౌంట్స్ ఆఫీసర్ – 6
  • మెడికల్ ఆఫీసర్స్ (జనరల్) – 7
  • మెడికల్ ఆఫీసర్స్ (స్పెషలిస్ట్‌) – 7
Spread the love