ఆ రూల్‌ అవసరం లేదు!

MS Dhoni– ఇంపాక్ట్‌ ప్లేయర్‌పై ఎం.ఎస్‌ ధోని
చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) చర్చనీయాంశంగా మారిన రూల్‌ ఇంపాక్ల్‌ ప్లేయర్‌. మ్యాచ్‌ గతినే మార్చివేస్తున్న ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌తో దాదాపు ప్రతి జట్టు 12 మందితో బరిలోకి దిగుతోంది. అవసరాని అనుగుణంగా బౌలర్‌, బ్యాటర్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా జట్లు ఆడిస్తున్నాయి. రెండు సీజన్లుగా ఐపీఎల్‌లో ఈ రూల్‌ కొనసాగుతుంది. క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు సహా విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌ ధోని జియోస్టార్‌తో మాట్లాడుతూ ఈ రూల్‌ అవసరం లేదని వ్యాఖ్యానించాడు. ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ గురించి తొలిసారి విన్నప్పుడు.. ఐపీఎల్‌ మంచిగా సాగుతోంది. టీఆర్‌పీ రేటింగ్స్‌ ఎక్కువగా ఉన్నాయి. క్రికెట్‌ క్వాలిటీ సూపర్‌గా ఉంది. మంచి ఆటగాళ్లు లీగ్‌ నుంచి పుట్టుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ రూల్‌ అవసరం లేదు. కానీ అమలు చేశారు. నిజానికి ఓ రకంగా ఇది ఉపయుక్తమే. కానీ నేను వికెట్‌ కీపింగ్‌ చేయాల్సి ఉంటుంది. అందుకే నేను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా రాలేను’ అని ధోని తెలిపాడు.

Spread the love