ధోనికి శస్త్రచికిత్స

ముంబయి : భారత క్రికెట్‌ దిగ్గజం ఎం.ఎస్‌ ధోని మోకాలు గాయానికి శస్త్రచికత్స చేశారు. ఎడమ కాలు మోకాలు నొప్పి వేధిస్తున్నప్పటికీ ఐపీఎల్‌16లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు సారథ్యం వహించిన ధోని.. ఆ జట్టు కు రికార్డు ఐదో టైటిల్‌ అందించాడు. సోమవారం అహ్మదాబాద్‌లో ఫైనల్‌ అనంతరం ధోని నేరుగా ముంబయికి చేరుకున్నాడు. ఆర్థో పెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ దిన్షా పర్దివాల సిఫారసు మేరకు ముంబయిలోకి కోకిలాబెన్‌ హాస్పిటల్‌లో ధోనికి గురువారం శస్త్రచికత్స చేశారు. మోకాలు గాయానికి సర్జరీ విజయవంతమైందని సూపర్‌కింగ్స్‌ వర్గాలు తెలిపాయి.

Spread the love