స్వయం ఉపాధి కల్పించడమే ధ్యేయం

– ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషాదయాకర్ రావు
– మండలంలో నాలుగో విడత కుట్టు శిక్షణ ప్రారంభం 
నవతెలంగాణ- పెద్దవంగర: మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుందని ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు అన్నారు. ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరంలో భాగంగా గురువారం పెద్దవంగర, చిట్యాల గ్రామాల్లోని రైతు వేదికలో నాలుగో విడత కుట్టు శిక్షణ శిబిరాలను ఆమె ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. శిక్షణతో పాటు ఉచిత భోజన వసతి కల్పిస్తూ, ఉచితంగా మిషన్ అందిస్తున్నామని తెలిపారు. గత సుదీర్ఘకాలంగా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విస్తృత స్థాయిలో సేవలు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం మంత్రి ఎర్రబెల్లి కృషి చేస్తున్నాడని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎం నరేంద్ర కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, మాజీ ఏఎంసీ చైర్మన్ కేతిరెడ్డి సోమనర్సింహా రెడ్డి, సర్పంచులు వెనుకదాసుల లక్ష్మి, కేతిరెడ్డి దీపిక రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఏదునూరి శ్రీనివాస్, ఎర్ర సబిత, మండల నాయకులు శ్రీరామ్ సుదీర్, బొమ్మెరబోయిన రాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి, ఉపసర్పంచులు శ్రీరామ్ రాము, ఈదురు లచ్చమ్మ, నాయకులు పల్లపు పరమేష్, సీసీలు పద్మ, సుధాకర్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
Spread the love