బైకును ఓవర్ టెక్ చేయబోయి ఆటో బోల్తా

– పదిమంది కూలీలకు తీవ్ర గాయాలు
– ఇద్దరి పరిస్థితి విషమం
– 9 మందిని ఖమ్మం తరలింపు
నవతెలంగాణ-కల్లూరు 
మదర్ రోడ్ లో ముందు వెళ్తున్న బైకును కూలీలతో వెళుతున్న ఆటో ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న పదిమంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది . స్థానికులు ఆటోలో ప్రయాణిస్తున్న వారు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని పెద్ద కోరుకొండి పోచవరం మధ్యలో రైతు వేదిక వద్ద తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన కూలీలు పెద్ద కోరుకొండి మీదుగా ఊటుకూరు వెళుతుండగా ముందు వె డుతున్న బైకును తప్పించబోయి గుంతలో పడి అదుపుతప్పి బోల్తా పడింది. కృష్ణాజిల్లా ఊటుకూరు గ్రామంలో మొక్కజొన్న చేలో కూలి పనుల కోసం ఉదయం ఏడు గంటలకు బయలుదేరి వెళ్తున్నారు. ఆటోలో ఉన్న కూలీలు పదిమంది గాయాలు పాలయ్యారు. పదిమందిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆటో బయలుదేరిన 30 నిమిషాల్లోనే ప్రమాదం గురైనట్లు కొన్నవెల్లి గ్రామానికి సమాచారం అందడంతో బాధితుల బంధువులు రోధనలతో ఆ ప్రాంతం విషాదఛాయలు అలుముకున్నాయి. గాయపడిన వారిలో భద్రమ్మ, చీమకుర్తి కృష్ణమ్మ, ఈశ్వరి, బండి పద్మ, చీమకుర్తి వెంకటయ్య, ఈదుల పద్మ, సాయి శ్రీని, పి పుల్లమ్మ, ఏ. యువ సాయి, గాయాలయ్యాయి. స్థానికులు ఎస్సై షాకీర్    సమాచారం ఇవ్వవడంతో సంఘటన స్థలానికి చేరుకొని  108 కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి 108 చేరుకొని గాయపడిన వారిని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, వైద్యాధికారి నవ్య కాంత్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
Spread the love