వచ్చే పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి

 – బిసి సంఘాల నాయకుల డిమాండ్
నవ తెలంగాణ- మల్హర్ రావు: వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిసి బిల్లు పెట్టాలని బీసీ కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో బిసి సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నాయకున్ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామని చెప్పడంపై మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.మంథని నియోజకవర్గంలో బిఅరెస్ పార్టీ నుంచి బిసి బిడ్డ పుట్ట మధుకర్  ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్న బీసీ జనాభాకు రాజకీయపరంగా చట్టసభలో బీసీ  రిజర్వేషన్లు లేవని, ఉద్యోగ పరంగా  విద్యాపరంగా చాలా వెనుక పడ్డామన్నారు. తెలంగాణ బీసీ ప్రజలలు ఆలోచన చేయాలన్నారు.ఓటు మనమే సీటు మనదే రాజ్యాధికారం మనదే రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.బీసీలను  అసెంబ్లీకి పంపితే మన వాటా శాతం గురించి కొట్లాడుతారన్నారు.చట్టసభలో రిజర్వేషన్ మాట్లాడతారని చెప్పారు. కార్యక్రమంలో బిసి సంఘము జిల్లా ఇంచార్జి విజయగిరి సమ్మయ్య, మండల బీసీ సంఘం నాయకులు అను పెద్ది రాంబాబు, దెంచినాల తిరుపతి,చల్ల కుమారస్వామి, కోట సురేష్ గౌడ్.,కొడాలిబాపు,సమ్మయ్య,మొండయ్య, ఓజాల చంద్ర చారి, ఓజల బ్రహ్మచారి,తంగళ్ళపల్లి ప్రకాచారి. రమణ చారి. సంపత్. రాజమౌళి. రాజు. శ్రీనివాస్ చారి. కేశవ్. మధు. తదితరులు పాల్గొన్నారు.
Spread the love