చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాలు లభ్యం

నవతెలంగాణ-హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సమీప చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాలు లభించడం కలకలం సృష్టిస్తోంది . నగర వనం చెరువులో ఆదివారం ఇద్దరి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి పరిశీలించిన తరువాత చెరువు ఒడ్డున మరో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఒకేసారి ముగ్గురు మహిళల మృతదేహాలు లభించడం గ్రామంలో కలకలం రేగింది. అయితే మృతులు ఎవరనేది పోలీసులు వాకబు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Spread the love