ప్రభుత్వం ప్రిలిమ్స్ పరీక్ష రద్దు.. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనం..

– నిరుద్యోగులకు లక్షరూపాయాలు నష్టపరిహారం అందించాలి..
– తక్షణమే కమీషన్ ప్రక్షాళన చేయాలి.
– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం డిమాండ్
నవతెలంగాణ -జఫర్ గడ్
మరోసారి తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కావడానికి ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ నిర్లక్షమే నిదర్శనం అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సమావశానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మ భిక్షం పాల్గొని మాట్లాడుతూ…. ఒక్కసారి పేపర్ లీకేజీ వల్లన ఈ రాష్ట్రంలో రెండవ సారీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ నిర్వహించిన పరీక్షలో కూడా అదనంగా ఓఎంఆర్ షిట్స్ వచ్చాయని అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళారు. పేపర్ లీకేజీ తర్వాత కూడా ప్రభుత్వం, బోర్డు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. మళ్ళీ పరీక్ష పై అనుమానాలు వ్యక్తం అయినా వాటి గురించి చైర్మన్ కూడా స్పష్టంగా ప్రకటించలేదు. మళ్ళీ ఈ కమీషన్ నిరుద్యోగులకు భరోసా కల్పించేలా పరీక్ష నిర్వహించలేదు. ఈ పదేళ్ల కాలంలో వచ్చిన ఒకే ఒక్క గ్రూపు -1 నోటిఫికేషన్ఇది. మళ్ళీ మళ్ళీ పరీక్ష రద్దు అయ్యిందని ఎంతోకాలం వెచ్చించి, కొచింగ్ సెంటర్లు, హస్టల్స్ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వయస్సు రీత్యా కూడా ఇదే చివరి. నోటిఫికేషన్ అని. భాధపడుతున్న అభ్యర్థులు ఎందరో ఉన్నారు. వారీకి ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహాణలో ఎలాంటి భరోసా ఇవ్వలేదు. అందుకే ముమ్మాటికి ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం, తక్షణమే విశ్వాసం కోల్పోయిన బోర్డ్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని భర్తరఫ్ చేయాలి. మొత్తం కమీషన్ ప్రక్షాళన చేయాలి.ప్రస్తుతం కేసులో ఉన్న వారిని విధులు నుండి పూర్తిగా తోలగించాలి.భవిష్యత్ నిర్వహించే పరీక్షలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 30 లక్షల నిరుద్యోగులకు ప్రభుత్వం టీఎస్పీఎస్సీ పై.నమ్మకం కల్గించేలా బోర్డు ప్రక్షాళన చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. అభ్యర్థులు నష్టపోయిన సమయం, ఆర్ధిక ఇబ్బందులు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని లక్ష రుపాయాలు నష్టపరిహారం ఇవ్వాలి. గతంలో విద్యార్థులు, నిరుద్యోగులు డిమాండ్ చేసినట్లుగా ప్రభుత్వం కమిషన్ మార్చి పరీక్షలు నిర్వహించి ఉంటే ఇలాంటి పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఉద్యమ కాంక్ష అయినా నియామకాలు ప్రభుత్వం తక్షణమే పారదర్శకంగా జరపాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి యకాన్న ,మండల కార్యదర్శి సిరికొండ అర్జున్ ,నాయకులు పవన్, రామ్ చరణ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love