– జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కష్ణయ్య
– వన్ నేషన్-వన్ ఎలక్షన్‌లో బీసీల వాటా ఎంత? సీట్లు ఎన్ని?
– బీసీ బిల్లు పెట్టిన తర్వాతనే వన్ నేషన్-వన్ ఎలక్షన్ పెట్టాలి
నవతెలంగాణ-అంబర్‌పేట
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో బీసీ బిల్లు మహిళా బిల్లు పెట్టాలని తర్వాతనే వన్ నేషన్ వన్ ఎలక్ష న్ బిల్లు ప్రవేశపెట్టాలని లేనియెడల 21న చలో ఢిల్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కష్ణ య్య కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. సోమ వారం కాచిగూడ అభినందన్ హౌటల్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ బీసీ కన్వీనర్ గుజ్జ కష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కష్ణయ్య హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జరిగిన అభివద్ధి గురించి పార్ల మెంట్ ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నట్లు కేంద్ర మంత్రులు ప్రకటించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, మహిళా బిల్లులో మహిళలకు సబ్ కోటా కల్పించాలని, కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని సెప్టెంబర్ 21న చలో ఢిల్లీ ఉద్యమ కార్యక్రమం చేపట్టా లని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.6 సంవత్సరా లు గా బీసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని, పార్లమెంటు ప్రత్యేక సమావే శా లలో మహిళా బిల్లు పెట్టాలని ప్రతిపాదించారు. అయితే మహిళా బిల్లులో ఆర్. బీసీి/ఎస్సీ/ఎస్టీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని కోరారు. మహిళ బిల్లులో బి.సి మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మహిళ బిల్లుకు సార్ధకత లేదన్నారు. ఇప్పటికి మహిళ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది అని లోక్ సభలో కూడా పెట్టి పూర్తి చేయాలని కోరారు. రాజకీయ పార్టీల నాయకులు బీసీ మహిళల గురించి, వారికి జరుగుతున్న అన్యాయాల గురి ంచి, అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడటం ల మహిళ బిల్లులో రాజకీయ రిజర్వేషన్ల తో పాటు విద్యా ఉద్యోగాలలో కూడా 50 శాతం రిజర్వేషన్ల ను ప్రవేశ పెట్టాలని, రాజ్యాంగ రచనలో బి.సిలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాలలో రిజర్వేషన్లు పెడితే ఎం తో ప్రగతి జరిగేదన్నారు. బీసీ నాయకులు నీలం వెంక టేష్, రాజు కుమారు, అనం తయ్య, ఆది మల్లేష్, సుధా కర్, గంగాభవాని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.