– ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్. ఏల్ మూర్తి
నవతెలంగాణ – డిచ్ పల్లి
నూతన జాతీయ విద్యా విధానం తో విద్యార్థులకు శాస్ర్తీయమైన విద్యను అందించకుండా కేంద్ర ప్రభుత్వం కషాయికరణను పెంచి పోషిస్తుందని, ఈ జాతీయ విద్యావిధానం ఓ విపత్తు లాంటిదని దీన్ని నివారణ కోసం ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్త ఉద్యమాన్ని నడిపిందని ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి అన్నారు.భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కళాశాల మినీ సెమినార్ హల్ లో ఆహ్వాన సంఘంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్. ఏల్ మూర్తి హాజరై ఈ తెలంగాణ యూనివర్సిటీ లో రాష్ట్ర యూనివర్సిటీ ల కన్వెన్షన్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం రీసెర్చ్ స్కాలర్స్ ఫెలోషిప్ ల విషయం లో ప్రతి సంవత్సరం కోత విదిస్తుందని అన్నారు. ఆదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో విద్యారంగానికి 7.7% శాతం అరకొర నిధులు కేటాయించడం సరైంది కాదన్నారు. వెంటనే కొఠారి కమిషన్ పేర్కొన్న రాష్ట్ర బడ్జెట్ లో 30%నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పున:సమిక్షించలని అన్నారు. అదే విధంగా మేధో శక్తి కి ఉత్పత్తి కేంద్రాలుగా విలసిల్లుతున్న రాష్ట్ర యూనివర్సిటీల కు 500 ల కోట్లు కేటాయించడం దారుణమని వెంటనే యూనివర్సిటీల కు అధిక నిధులు కేటాయించాలన్నారు. ఖాళీ గా ఉన్నా ప్రొఫెసర్ పోస్టులను ఈ ప్రభుత్వం భర్తి చేయాలని అన్నారు. ఈ ఆహ్వానం సంఘం లో సభ్యులుగా ప్రొఫెసర్లు, మేధావులు, విద్యావేత్తలు, వైద్యులు ఉన్నారని అన్నారు. వారి తో రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ కరపత్రాన్ని ముఖ్య వక్త లైన ప్రొఫెసర్ పున్నయ్య, నరాల సుధాకర, రామ్ మోహన్ రావు లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విఘ్నేష్, అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, మహేష్, దీపిక, యూనివర్సిటీ అధ్యక్షులు ప్రసాద్,నాయకులు దినేశ్, అభి, గణేష్, శివ, తదితర నాయకులు పాల్గొన్నారు.