ఆశావర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలి

నవతెలంగాణ-మల్లాపూర్‌
ఆశాకార్యకర్తల డిమాం డ్లను పరిష్కరించే వరకూ పోరాటం ఆగదని ఆశాలు అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేస్తున్న రిలే నిరహార దీక్ష రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పెరుగుతున్న ధరలకనుగుణంగా ఆశాలకు ఇస్తున్న పారితోషికాలను రూ.18వేలు పెంచాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో లయ, శిరీష,లావణ్య,స్వప్న, రమ, వసంత, లత,శాంత, రాజేశ్వరి,ప్రేమలత, సరిత తదితరులు పాల్గొన్నారు.
మెట్‌పల్లి :ప్రజారోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మిస్తున్న ఆశాకార్యకర్తల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్‌ మెట్‌పల్లి పట్టణ అధ్యక్షుడు మహ్మద్‌ ఖుతుబోద్దీన్‌ పాషా అన్నారు. పట్టణంలోని అంబేద్కర్‌ పార్క్‌ ఎదుట ఆశాకార్యకర్తలు చేపట్టిన దీక్ష కార్యక్రమాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కేసీఆర్‌ కల్లబొల్లి మాటలను నమ్మకుండా రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

Spread the love