సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడం కమ్యూనిస్టుల ప్రథమ కర్తవ్యం

the-first-duty-of-communists-is-to-oppose-imperialism(నిన్నటి తరువాయి….)
చాలా కాలం క్రితం,హిందూత్వ పితామహుడు వీ.డీ. సావర్కర్‌, 1950లో ఇజ్రాయిల్‌ను ప్రశంసించి, వారి పొరు గునున్న ముస్లింలతో వారెలా వ్యవహరిస్తున్నారో మనం వారి నుంచి నేర్చుకోవాలన్నాడు.అంటే జియోనిస్టులు, హిందూత్వ శక్తులు భావజాల పరంగా ఒకే విధంగా ఉన్న ట్లు తెలుసుకున్నారు. బీజేపీ నాయకత్వంలోని వాజ్‌ పారు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు వాషింగ్టన్‌,టెల్‌-అవీవ్‌, ఢిల్లీల మధ్య ఉన్న అక్షాన్ని గ్రహించారు. వాజ్‌ పారుకి ప్రధాన కార్యదర్శి మరియు జాతీయ భద్రతా సలహాదారైన బ్రిజేష్‌ మిశ్రా అమెరికా వెళ్లి,యూదు మహా సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ,భవిష్యత్తులో మనకు భారత్‌ -అమెరికా- ఇజ్రాయిల్‌ అక్షం ఉంటుందని ప్రకటించాడు. భారతదేశానికి, ఇజ్రాయిల్‌ భారీగా మిలిటరీ సామాగ్రిని సమకూర్చే పెద్ద సరఫరాదారుగా మారిందని మనకు తెలుసు.అది, భారత్‌ కు అన్ని గూఢచార వ్యవస్థ పరికరాల్ని సరఫరా చేస్తుంది. ఇజ్రాయిల్‌ సమకూర్చిన పెగాసస్‌ సాంతిేకతను, మన ఫోన్లకు హాని కల్గించేందుకు ఉపయోగిస్తున్నారని విన్నాం. కాశ్మీర్‌ లో, ఇప్పుడే కాదు, గత 20 ఏళ్ళుగా కాశ్మీర్‌ ప్రజలపై నిఘా ఉంచేందుకు విని యోగించే సాంకేతికతలన్నీ ఇజ్రాయిల్‌ నుండి తెచ్చినవే.
కాబట్టి కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో మనకేమి నేర్పింది?
ప్రపంచ వ్యాప్తంగా మనం సామ్రాజ్యవాదంపై పోరా డాలి, దాన్ని వ్యతిరేకించాలి, సామ్రాజ్యవాదం వల్ల బాధ పడుతున్న వారికి సంఘీభావాన్ని తెలియజేయాలి. అం దుకే, మన జాతీయ విముక్తి పోరాట కాలంలో ఇజ్రాయిల్‌ వ్యాపారం మొత్తం పాలస్తీనియన్ల ఖర్చుతో చేసినప్పుడు, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే గాంధీతో సహా జాతీయోద్యమ నాయకత్వం, పాలస్తీనాకిప్పుడు అన్యాయం జరుగుతుందని అన్నారు.పాలస్తీనియన్ల ఖర్చుతో మీరు యూదులకు న్యాయం చేయలేరు. తమ మాతభూమిని పొందే హక్కు పాలస్తీనియన్లకు ఉంది.అప్పటినుండి అదే మన స్థిరమైన విధానం.
అందువల్ల మోడీ ఏమి చేస్తాడనే దానితో నిమిత్తం లేకుండా పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని తెలియ జేయడమే మన మొదటి కర్తవ్యం.భారతదేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్‌ మీడియా వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదని మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రా యిల్‌కు మాత్రమే మద్ధతిచ్చే మీ వైఖరి తప్పు అని తమ ప్రభుత్వాలకు చెప్పే ప్రజలు కూడా అమెరికా, ఐరోపా దేశాల్లో ఉన్నారు. ఇజ్రాయిల్‌ ఆక్రమణకు, దాడికి పాలస్తీని యన్లు చాలాకాలంగా బాధితులుగా ఉంటున్నారు. తమ మనుగడ, విముక్తి కోసం పోరాటం చేస్తున్న బాధితులు పాల్పడే హింసను, వలసవాదులు మరియు అణచివేత దారులు పాల్పడే హింసతో సమానంగా చూడకూడదని మన బూర్జువా మేథావులకు, మీడియాకు చెప్పాలి. హమాస్‌ దాడి సమయంలో అమాయక ప్రజలు,ముఖ్యంగా మహిళల్ని, పిల్లల్ని చంపడాన్ని ఖండిస్తూ, బహిరంగంగా విమర్శించాలి. అంటే దానర్థం,గాజాపై చేసిన దుర్మార్గమైన దాడిలో వందలాదిమంది సాధారణ మహిళలు, పిల్లలను చంపడం వంటి దారుణాల పట్ల మనం గుడ్డిగా ఉండాలని కాదు.ఒక పిల్లవాడిపై కాల్పులు జరపడం అనాగరికమనీ, ఒక పిల్లవాడిపై బాంబు విసరడం సరైనదేనని ఎవరైనా చెప్పగలరా? ఈ రెండూ యుద్ధ నేరాలే. కాబట్టి ఆ రెంటినీ ఖండించాలి.
అణచివేతకు గురైనప్పటికీ వలస ప్రజలు స్వాతంత్య్రం పొందడంలో విజ యం సాధించారు. వీరి వలె కాక పాలస్తీ నియన్లు, దురదష్టవంతులుగా అణచివే తకు గురవుతున్నారని మనం గమనించ కుంటే, ఈ విషాద వైరుధ్యాన్ని అర్థం చేసు కోలేం. నేను చెప్పినట్లు, పాలస్తీనా పని 20వ శతాబ్దంలో అసంపూర్తిగా మిగిలి ఉంది. 21వ శతాబ్దంలో మనం ఆ దిశగా పని చేయాల్సి ఉంటుంది. ఇజ్రాయిల్‌కు ఉనికిలో ఉండే హక్కుంది. 75 ఏళ్ళుగా ఉనికిలో ఉంటూనే ఉంది. ఇజ్రాయిల్‌కు ఉనికిలో ఉండే హక్కు లేదంటున్న హమాస్‌తో కూడా మేము ఏకీభవిం చం. 1967కు ముందున్న హద్దుల్లో వారిని ఉనికిలో ఉండ నివ్వండని మేము అంటున్నాం. 1967 యుద్ధం తరువాత ఇజ్రాయిల్‌ ఈ అదనపు భూభాగాలు అన్నిటినీ ఆక్రమిం చింది. 1967 ముందున్న హద్దులకు తిరిగి వెళ్తే, మిగిలిన ఈ భూభాగాలన్నీ ఎలాంటి అడ్డంకుల్లేకుండా పాలస్తీనా మాతభూమిగా మారుతాయి అని మేం వారికి చెప్తున్నాం.
నేడు మన దేశంలోని ఆధిపత్య హిందూత్వ కథనం ప్రకారం, ఇలా మాట్లాడుతున్నందుకు మనపై దాడి జర గొచ్చు. తమను వ్యతిరేకిస్తున్న ఎవరినైనా ఈ ప్రభుత్వం ఏదో విధంగా టెర్రరిస్టులని ముద్ర వేస్తుంది. కాశ్మీర్‌లో ప్రతీ ఒక్కరూ టెర్రరిస్టే. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న జర్న లిస్టులు కూడా టెర్రరిస్టులే. కాబట్టి, వారు మనను టెర్రరి జానికి మద్ధతుదార్లని ముద్రవేయడం సహజం. అయితే, మనం ఇలాంటి వాటికి నిరుత్సాహపడొద్దు. ఎందుకంటే ఈ పోరాటం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఓ భాగం. విదేశాంగ విధానం కేవలం దేశీయ విధానం పొడిగింపు మాత్రమే. యూదు రాజ్యాన్ని స్థాపించ ప్రయత్నిస్తున్న ఇజ్రాయిల్‌ వలె హిందూ రాజ్యాన్ని స్థాపించ డానికి మైనారిటీల్ని లక్ష్యంగా చేసుకొని, వారిని రెండవ తరగతి పౌరులుగా మార్చడమే హిందూత్వవాదుల దేశీయ విధానం. కాబట్టి, నేడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరే కంగా చేస్తున్న మన పోరాటం, ప్రజాస్వామ్యం, లౌ కికవాదం, సమాఖ్య నిర్మాణం, రాజ్యాంగం, మొ త్తంగా ప్రతిపక్షాల ప్రజాస్వామిక హక్కులపై అది చేస్తున్న దాడికి వ్యతిరేకంగా మాత్రమే కాక, ఈ ప్రభుత్వ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం కూడా. దానిని ఆపకుంటే, అది నయా ఫాసిజానికి దారితీసే మార్గంలోకి పోతుంది.
ఇదే ఇజ్రాయిల్‌లో జరుగుతుంది. విచిత్రమైన విషయం ఏమంటే, హమాస్‌ దాడికి ముందు, నెత న్యాహు ప్రభుత్వం ప్రజల నుంచి భారీగా నిరసన లను ఎదుర్కొంటుంది. నెతన్యాహు, న్యాయ వ్యవస్థను అదు పు చేసేందుకు చట్టాల్ని ఆమోదింపచేసుకునే ప్రయ త్నం చేస్తున్నాడు. అక్కడ ప్రజలు పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ మన భారత ప్రభుత్వం పార్లమెంట్‌తో పాటు మీడి యాను, న్యాయ వ్యవస్థను, ప్రతీదాన్ని అదుపు చేయాలని అనుకుంటుంది. ఇప్పటికే మనకు హిందూత్వ నిరంకుశ పాలన ఉంది. మనం అర్థం చేసుకోవాల్సిందే మంటే, దాన్ని నిరోధించకుండా, ప్రతిఘటించకుండా అనుమతిస్తే, అది నయా ఫాసిజం రూపానికి దారితీస్తుంది. మనం మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు, దాని విదేశాంగ విధానానికి కూడా వ్యతిరేకంగా నిలబడుతున్నట్లే లెక్క.ఎందుకంటే అమెరికా, బైడెన్‌లు ఇజ్రాయిల్‌లోని ప్రగతి నిరోధక ప్రభుత్వానికి, సామ్రాజ్యవాదానికి మద్దతు ఇచ్చి నట్లే, యునైటెడ్‌ స్టేట్స్‌ మోడీకి, హిందుత్వవాదులకు పూర్తి మద్ధతుగా ఉంటుంది. కాబట్టి, మన పోరాటాలు సమగ్రం గా ఉండాలి. అవి విదేశాంగ, దేశీయ విధానాలకు వ్యతిరే కంగా, భారతదేశ లౌకిక, ప్రజా స్వామిక లక్షణాలను మార్చే అన్ని దాడులకు వ్యతిరేకంగా ఉండాలి.
(”పీపుల్స్‌ డెమోక్రసీ” సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్‌, 9848412451
– ప్రకాశ్‌ కారత్‌

Spread the love