
మహామేడారం జాతరలో తొలి ఘట్టం మొదలైంది. ఆదివాసీ గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా తెలంగాణ, ఆంద్రప్రదేశ్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి ఆదివాసీ గిరిజనులు బుదవారం తమ సాంప్రదాయాలతో నృత్యాలు చేస్తఊ మేడారంలోని గిరిజన భవన్ చేరుకోగా మేడారం పూజారులు వారిని స్వాగతించారు. ఈ సందర్బంగా ౠదివాసులలోని 3,4,5,6,7 గొట్టు వేల్పులకు చెందిన ఆదివాసులు తమ గ్రామాల నుండి వెంట తెచ్చిన దారెల్లి కర్రలు, దేలుగుడ్డలతో ౠదివాసీ సాంప్రదాయాలు ఉట్టి పడేలా శివ సత్తుల శిగాలు, పోతురాజులు, లక్ష్మీదేవరలు నత్యాలు చేస్తూ సంబరాలు చేశారు. సుమారు గంట పాటు ఆదివాసీ భవన్ ఆవరణలో తమ సాంప్రదాయాలను తెలుపుతూ గిరిజనులు నృత్యాలు చేశారు. అనంతరం మేడారం పూజారులు అక్కడి తునికి చెట్టుకు గిరిజన సాంప్రదాయంతో పూజలు చేసి గొట్టు వేల్పుల సమ్మేళరం ప్రారంభమైనట్లు ప్రకటించారు.