
– వెంటనే జిల్లా యంత్రాంగం క్యాంపులు ఏర్పాటు చేయాలి
– బాధితులకు సరైన వైద్యం అందించాలని ఆదేశం
– దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెఱకు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
కలుషిత నీరు తాగి దుబ్బాక పట్టణ, మండల ప్రజలు సుమారు 50 మంది అస్వస్థకు గురైన విషయం అందరికీ తెలిసిందే. ఐతే ఈ విషయం తెలుసుకుని దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెఱకు శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం దుబ్బాక ఏరియా వంద పడకల ఆసుపత్రికి చెరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దుబ్బాక మండలం బల్వాంతపూర్, పద్మశాలిగడ్డ, నారెండ్లగడ్డ దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి గ్రామాలకు చెందిన సుమారు 50 మంది కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురవుతున్న ఘటన అత్యంత బాధాకరం. సీఎం కేసిఆర్ ఇలాకా, ఆర్థిక ఆరోగ్య మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో ఇలాంటి ఘటన జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పేరుకు వంద పడకల ఆసుపత్రే ఐనా పూర్తి స్థాయిలో వసతులు లేక సిద్దిపేట కు పంపించడంతో ఇక్కడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయో, ప్రజా ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తోందని చెఱకు శ్రీనివాస్ ఆరోపించారు. వాటర్ కంటెం ఎలా జరిగింది, ఫిల్టర్ నీళ్ళు తాగుతున్న బాధితులకు ఇలాంటి ఘటన వెనుక అసలు కారణాలు ఏంటో జిల్లా యంత్రాంగం వెంటనే నిజా నిర్ధారణ చేయాలనీ డిమాండ్ చేశారు. హాస్పిటల్ తోపాటు జిల్లా యంత్రాంగం ఆయా గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసిన 24 గంటలు బాధితులకు వైద్య పరీక్షలు చేసి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, దుబ్బాక పట్టణ జనరల్ సెక్రెటరీ మంద శ్రీనివాస్, మట్ట కిషన్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కొర్డినేటర్ ఉషయ్య, రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ఆకుల భరత్, బాస మధు, డిపి రాములు, తదితరులు చెఱకు వెంట ఉన్నారు.