జీవకళ కోల్పోతున్న పెద్దవాగు కథనానికి  స్పందించిన ప్రభుత్వ విప్..

– నవతెలంగాణ కథనానికి విశేష స్పందన..
– గంగమ్మ తల్లిని దర్శించుకుంటున్న ఎమ్మెల్యే ఆది..
– మూల వాగులో,గుడి చెరువులో మురికినీరు కలవకుండా చర్యలు..
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
– గంగాభవాని తల్లి బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్..
నవతెలంగాణ – వేములవాడ 
“నవతెలంగాణ పత్రికలో ఈనెల 7న జీవకళ కోల్పోతున్న పెద్దవాగు అనే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది”.. ఆ కథనానికి వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందిస్తూ మూల వాగులో,గుడి చెరువులో మురికినీరు కలవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అనారు. ఆదివారం వేములవాడ పట్టణంలో గంగపుత్ర సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గంగాభవాని తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు..  అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు వలన సకాలంలో వర్షాలు పడి చెరువులు, కుంటలు, బావులు నిండి ప్రజాలంతా సుఖ సంతోషంగా ఉండాలని వేడుకున్న అని అన్నారు. గంగమ్మ తల్లి వద్దకు వచ్చేలా అనుబంధంగా బ్రిడ్డి నిర్మాణనికి గతంలోనే అంచనాలు రూపొందించి అధికారులకు పంపమని కానీ ఎన్నికల కోడ్ కారణంగా కొంత ఆలస్యం అయ్యిందన్నారు.త్వరలోనే బ్రిడ్డి నిర్మాణ పనులు ప్రారంభం అవతాయన్నారు.మూల వాగులో,గుడి చెరువులో మురికి నీరు కలవకుండా చర్యలు చేపడుతున్నాం అని హామీ ఇచ్చారు.గుడిచెరువు లోకి మురుగు నీరు చేరడం వలన చేపలకు ఆక్సిజన్ అందక చనిపోతున్నాయని ,అలాగే యాత్రికులు కూడా మురుగు నీరు ద్వారా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు..  16 కాలువల ద్వారా మురికి నీరు గుడి చెరువులోకి కలవకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని  గత ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించుకున్న పట్టించుకున్న పాపానపోలేదన్నారు.చుక్కా మురికి నీరు గుడి చెరువులోకి, మూల వాగులోకి చేరకుండా ప్రభుత్వం త్వరలోనే పనులను ప్రారంభిస్తుదన్నారు.వచ్చే పండగ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగేలా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్ ఇప్పప్పులా అజయ్, గంగపుత్ర సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, పుల్కం రాజు, ధూమ్ మధు, చిలుక రమేష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love