Monday, June 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపెంచిన గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలి

పెంచిన గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్‌‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను రూ.29లు పెంచుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం, చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజల నడ్డి విరచడమేననీ, ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ తెలిపారు. ఆ పెంపును వెంటనే ఉపసంహ రించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజలపై వరుసగా భారాలు మోపుతున్నదని విమర్శించారు. దేశంలో ఇంధన నిల్వలకు కొరత లేదని ప్రజలను నమ్మిస్తూనే మరోవైపు భారీ ఎత్తున భారాలు మోపడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడంతో ప్రజలు ధరాభారంతో సతమతమవుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధిలో అంతరాయాలను సాకుగా చూపి, దేశ ప్రజలపై భారీగా ధరలు పెంచడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ఇది కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చడమేనని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -