అకాల వర్షానికి ఇల్లు కోల్పోయిన గుడిసె వాసులను ఆదుకోవాలి

– ధ్యారంగుల కృష్ణ, అధ్యక్షులు, ఇళ్ల స్థలాల సాధన కమిటీ
నవతెలంగాణ – కంటేశ్వర్
నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి, ఈదురు గాలులకు నిజామాబాద్ నగరంలోని అభయ హస్తం కాలనీ లోని గుడిసెలు కూలిపోయి గుడిసవాసులు నిరశ్రాయులు అయ్యారు. ఈ యొక్క ప్రాంతాన్ని ఇల్లు, ఇళ్ల స్థలాల సాధన కమిటీ అధ్యక్షులు ధ్యారంగుల కృష్ణ, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్థన్ లు  సందర్శించారు. ఈ సందర్భంగా ఇండ్లు, ఇళ్ల స్థలాల సాధన కమిటీ అధ్యక్షులు ధ్యారంగుల కృష్ణ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలో గల అభయ హస్తం కాలని లో 250 కుటుంబాలు ఏడాదిన్నర కాలంగా నివాసం ఉంటున్నాయని, ప్రకృతి విపత్తు వల్ల నిర్మించుకున్న ఇండ్లు ధ్వంసం అయ్యాయని, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలో భాగంగా ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇండ్ల స్థలాల ప్రజలు మునవార్,రాజన్న,నర్సింగ్,సావిత్రి, తదితరులు ఉన్నారు.
Spread the love