అజ్ఞాత దళ నాయకులను కోర్టులో హాజరుపర్చాలి : న్యూడెమోక్రసీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ నాయకులు ఎ రాజన్న, దేవిరెడ్డి జీవన్‌తోపాటు మరో నలుగురిని వెంటనే కోర్టులో హాజరు పర్చాలని ఆ పార్టీ సహాయ కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వారిని వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్‌ చేశారు.

Spread the love