– స్నేహితులే ప్రాణం తీశారా..?
నవతెలంగాణ-జక్రాన్ పల్లి : శనివారము ఉదయము అదృశ్యమైన వ్యక్తి సోమవారము ఉదయము శవమైతేలాడు. మండలంలోని పుప్పాలపల్లి గ్రామానికి చెందిన చాట్ల మహేష్ ( 29) శనివారం ఉదయం ఆదృశ్యమయ్యాడని సోమవారం ఉదయం గ్రామంలోని చెరువులో శవమై తేలాడని ఎస్ఐ తిరుపతి సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పుప్పాలపల్లి గ్రామానికి చెందిన చాట్ల మహేష్ భీమ్గల్లో స్వస్తిక్ కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడని శనివారం ఉదయం ఉద్యోగరీత్యా బైక్ పై వెళుతుండగా అదే గ్రామానికి చెందిన రమేష్ నరసయ్యలతో ఒకచోట కూడి మద్యం సేవించారని మద్యం సేవిస్తున్న తరుణంలో ముగ్గురి మధ్య గొడవ జరిగి గ్రామంలోని చెరువులో కొట్టి పడేశరని కుటుంబ సభ్యుల ఆరోపణ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. సంఘటన స్థలాన్ని ఏసిపి కిరణ్ కుమార్ డిచ్పల్లి సిఐ సందర్శించారు. జాగిలాలతో గ్రామంలోని పలు స్థలాల్లో పర్యవేక్షించారు. క్లూస్ టీమ్ అధికారులు వచ్చి వేలిముద్రలు సేకరించారని తెలియజేశారు. నరసయ్య రమేష్ లపై కుటుంబ సభ్యుల ఆరోపణ మేరకు వారిని అదుపులోకి తీసుకొని వారి పైన కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ తిరుపతి తెలిపారు.